దేవరకొండ..ఓ రౌడీ స్టార్‌..

266
- Advertisement -

”హై మైడియర్‌ లవ్‌లీ రౌడీస్”… అర్జున్‌రెడ్డి’ తర్వాత ఇలా ప్రతీ సినిమా ఫంక్షన్‌ లో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‌ ని ముద్దుగా పిలుచుకుంటాడు. ఇక ఫ్యాన్స్ ఏం తక్కువతిన్నారా..? ..విజయ్‌ పిలుపుకి …” హై రౌడీ” అంటూ బదులిస్తుంటారు.

 vijay devarakonda is a rowdy star...

అయితే.. ఇప్పుడు ‘రౌడీ’ టాపిక్‌ ఎందుకంటారా..? బిరుదు కోసం. ఒక్క హిట్‌ రాగానే హీరోస్‌ కి…ఆ స్టార్‌ …ఈ స్టార్ అంటూ..ముద్దుగా పిలుచుకోవడం మన టాలీవుడ్‌ సాంప్రదాయం. ఒక్కోసారి సినిమా హిట్‌ కాకుండానే కొంతమందికి తోకలుతగిలేస్తారనుకోండి అది వేరే విషయం.

vijay devarakonda

అసలు విషయానికొస్తే.. విజయ్‌దేవరకొండని ఏ స్టార్‌ అని పిలుచుకోవాలి..అనే డౌట్‌ ఇప్పుడు ఫ్యాన్స్‌ లో మొదలైంది. బహుషా…. సక్సెస్ తో విజయ్‌ అగ్రిమెంట్  రాసుకున్నాడేమో..అందుకే డిఫెరెండ్‌ స్టోరీ లైన్స్‌తో హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతున్నాడు. విజయ్‌ దేవరకొండ ఇప్పుడు యూత్‌ ఐకాన్ గా మారాడు.

తెలంగాణ యాసతో ధ్యాస మరిచేలా చేస్తున్న ఈ పిల్లగానికి ఎలాంటి బిరుదు ఇస్తారో అని ఫ్యాన్స్‌ ఆసక్తితో ఉన్నారు. మొత్తానికి ఫ్యాన్స్‌ మనసులో లవ్‌లీ రౌడీగా ఉన్న దేవరకొండని .. ఫ్యాన్స్‌ ‘రౌడీ స్టార్‌’ గా పిలుచుకోడానికే ఇష్టపడతారేమో..! చూడాలి మరి.

 vijay devarakonda is a rowdy star...

..

- Advertisement -