రిసెప్షన్‌కు రండి..షాకు విజయ్ ఆహ్వానం

3
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి తమ వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు.

తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, ఢిల్లీలో అమిత్ షాను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగినట్లు సమాచారం.

అమిత్ షా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించినట్లు తెలిసింది. విజయ్–రష్మిక వివాహ వేడుకలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, ప్రముఖులను వ్యక్తిగతంగా ఆహ్వానించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -