వైఎస్ ‘యాత్ర’లో విజయ్ దేవరకొండ..!

259
Vijay Devarakonda in YSR Biopic..!
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించింన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం మాజీ సీఎంలు ఎన్టీఆర్,వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న వైఎస్ బయోపిక్‌కు యాత్ర అనే టైటిల్‌ ఖరారు చేయగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో నటించేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తాజాగా టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ…జగన్ పాత్రలో నటించనున్నాడని టాక్.

జగన్ పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకుంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు విజయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ వార్తే నిజమైతే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌ మెంట్ కూడా రాబోతుందట.

- Advertisement -