విజయ్ దేవరకొండ హోలీ సాంగ్‌.. వీడియో వైరల్

742
vijay
- Advertisement -

హోలీ పండుగ.. చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది. దేశ వ్యాప్తంగా అన్ని మాతాలు ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్‌ చేస్తారు. యూత్‌ అయితే రంగుల్లో మునిగి తేలుతారు. ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటూ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

ఈ పండుగ సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండపై చిత్రీకరించిన హోలీ పాటను విడుదల చేశారు. అయితే ఇది ఇదివరకే చిత్రికరించిన పాట. కాకపోతే హోలీ పండుగ వచ్చింది కనుక మరోసారి ఈ పాటను వదిలారు. ప్రస్తుతం ఈ పాట వైరల్‌ అయ్యింది.

2017లో ప్రపంచ తెలుగు మహా సభలు వైభవంగా జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సభల కోసం కొన్ని పాటలను ప్రత్యేకంగా తెరకెక్కించింది. అందులో ఈ పాట ఒకటి. ఈ పాటను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, విజయ్ దేవరకొండ నటించాడు. హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ సాగే పాట యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

- Advertisement -