మహేశ్ చేతిలో కార్‌దేఖో..!

398
mahesh
- Advertisement -

సరిలేరు నీకెవ్వరుతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేష్..ఏఎంబీ సినిమాస్ పేరుతో థియేటర్‌ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మహేష్ 22 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా తాజాగా మరో కంపెనీని దక్కించుకున్నాడు.

కొత్త కార్లు లేదా పాత కార్లు కొనుగోలు చేయడం,వాటి ఫీచర్స్‌,ప్రాధాన్యత,వివిధ రకాల కార్ల బ్రాండ్ల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే కార్‌ దేఖో.కామ్ తరపున ప్రచారం చేయనున్నారు మహేష్.

త్వరలోనే కార్ దేఖోకు సంబంధించిన మహేష్ షూట్ జరగనుందట. దీంతో పాటు సిగ్నేచర్ పర్‌ఫ్యూమ్‌ బ్రాండ్‌ తరపున కూడా ప్రచారం చేయనున్నారట మహేష్. మొత్తంగా ఓ వైపు సినిమాలు మరోవైపు బ్రాండ్ అంబాసిడర్‌గా దక్షిణాదిలో అగ్రస్ధానంలో ఉన్నారు మహేష్‌.

- Advertisement -