ఐ యామ్ 25..స్టిల్ వ‌ర్జిన్ః విజ‌య్ దేవ‌ర‌కొండ‌

364
vijay devarakonda geethagovindam
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ త‌ర్వాత వ‌చ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాడు విజ‌య్. ప్ర‌స్తుతం విజయ్ దేవ‌ర‌కొండ మూడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ట్యాక్సివాలా సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల సిద్దంగా ఉండ‌గా మ‌రో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టిస్తున్న సినిమా గీత గోవిందం. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు.

vijaydevarakonda geetha govindam

తాజాగా నేడు ఈసినిమాలోని మ‌రో ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ తోనే మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు విజ‌య్ . ఐయామ్ స్టిల్ వ‌ర్జిన్ అంటూ ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఆగ‌స్ట్ 15వ తేదిన గీతా గోవిందం సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు త‌న ట్వీట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు విజ‌య్. తాజాగా విడుద‌లైన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ పై సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు అభిమానులు.

ఇప్ప‌టికే ఈసినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ను కూడా మొద‌లుపెట్టేశారు హీరో విజ‌య్. ఈసినిమాలో విజయ్ స‌ర‌స‌న హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న న‌టిస్తుంది. మీరు ఏమైనా అనుకోండి నా అఫీషియ‌ల్ స్టేట‌స్ మాత్రం ఇదే మేడ‌మ్ అంటూ ఫ‌స్ట్ లుక్ ఉంది. ఇక పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ లో ఐ యామ్ 25. స్టిల్ వ‌ర్జిన్ మేడ‌మ్ అని రాసుంది. ఈసినిమాకు ప‌రుశురామ్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్ట్ 15 న విడుద‌ల కానున్న ఈసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

- Advertisement -