- Advertisement -
సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానరల్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించనుండగా ఈ సినిమా తర్వాత మలయాళ రీమేక్ మూవీలో నటించనున్నారు చిరు.
మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన లూసిఫర్ తెలుగు రైట్స్‌ని రామ్ చరణ్ దక్కించుకోగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నటించనున్నారట.
ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హల్‌చల్‌గా మారింది. తొలుత ఈ పాత్రకోసం అల్లు అర్జున్‌ని అనుకున్న విజయ్ దేవరకొండని ఫైనల్ చేసినట్లు సమాచారం. మెగాస్టార్ – రౌడీ స్టార్ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వడం ఖాయం.
- Advertisement -