యంగ్‌ హీరో సరసన హెబ్బా..

269
- Advertisement -

కుమారి 21ఎఫ్ చిత్రంతో కుర్రకారును కట్టిపడేసిన బ్యూటీ హెబ్బా పటేల్. ఆ వెంటనే ఈడోరకం ఆడోరకం అంటూ మరో సక్సెస్ సాధించడం.. రెండు సినిమాల విజయాల్లోనూ హెబ్బా పాత్ర కీలకం కావడంతో.. ఆఫర్స్ వరుసపెట్టేశాయి. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.. మిస్టర్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. అమ్మడి గ్లామర్ కి మంచి రేటింగ్ నే ఇచ్చాయి. రీసెంట్‌గా ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న హెబ్బా పటేల్, ఆ తరువాత ‘మిస్టర్’ సినిమాతోను ప్రేక్షకులను పలకరించింది. ఆమె తాజా చిత్రాలుగా ‘అంధగాడు’ .. ‘ ఏంజెల్’ విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హెబ్బా పటేల్ మరో ప్రాజెక్టుకి ఓకే చెప్పేసింది.

Vijay Devarakonda Flim with Hebah Patel

రాహుల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది. యాక్షన్ అండ్ రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో.. ఇద్దరు కథానాయికలకి స్థానం ఉండటంతో, ఇప్పటికే ప్రియాంకను ఓ హీరోయిన్ గా ఎంచుకోగా.. ఇప్పుడు హెబ్బా కూడా ఈమెకు తోడైంది. ఎక్స్ ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా యంగ్ హీరోయిన్ కోసం వెతికిన దర్శకుడు.. చివరకు హెబ్బాను అప్రోచ్ అయ్యాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించనున్నాడు. వైవిధ్యభరితమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కబోతుందాట. మరి ఈ అమ్మడికి కథతో పాటు తన పాత్ర నచ్చడంతో హెబ్బా పటేల్ కూడా వెంటనే ఈ పాత్రకు సై అనేసిందట. ప్రస్తుతం అంధగాడు చిత్రంతోపాటు.. ఏంజెల్ ను పూర్తి చేసే పనిలో ఉంది ఈ బ్యూటీ. త్వరలోనే విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిపోనుంది.ఇప్పుడు హెబ్బాకి చేతినిండా సినిమాలున్నాయి

- Advertisement -