శివాత్మిక రాజశేఖర్ ,ఆనంద్ దేవరకొండ జంటగా నటించిన సినిమా దొరసాని. కేవీఆర్ మహేంద్ర ఈచిత్రానికి దర్శకత్వం వహించగా..మధుర ఎంటర్టైన్ మెంట్ సంస్ధ నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజై సూపర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్నఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రౌడి స్టార్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ మాట్లాడుతూ… నా తమ్ముడు సినిమాల్లోకి వస్తా అంటే ఫస్ట్ నేను వద్దు అన్నా.. అమెరికాలో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చాడు. సినిమా పరంగా నేను అతనికి ఒక్క హెల్ప్ కూడా చేయలేదు. నేను ఎలా కష్టపడ్డానో నువ్వు కూడా అలానే కష్టపడాలి అని చెప్పా.
కథ సెలక్షన్ నుంచి సినిమా విడుదలయ్యే వరకూ పడే కష్టాలన్ని నికు తెలియాలి అని నేను అస్సలు పట్టించుకోలేదని చెప్పాడు. ఈసందర్భంగా మాట్లాడుండగానే చాలా ఎమోషనల్ అయిన విజయ్ అందరి ముందు ఏడ్చేశాడు. నా తమ్ముడు అమెరికాలో జాబ్ చేస్తూ ఇంటికి డబ్బులు పంపిచేవాడు. అప్పుడు నేను సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్నా. ఆ టైంలో మా తమ్ముడు నా ఫ్యామిలీని ఆదుకున్నాడని చెప్పాడు. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈసినిమా జులై 12న విడుదల కానుంది.

