తెలుగులో ద్వార‌క‌..త‌మిళ్ లో అర్జున్ రెడ్డి

326
Arjun Reddy Dwaraka
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ తెలుగునాట సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఆయ‌న‌కు త‌మిళనాడులో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన నోటా సినిమా అక్క‌డ కూడా విడుద‌ల కావండంతో త‌మిళ్ లో విజ‌య్ కి పుల్ క్రేజ్ ఉంది. తెలుగులో నోటా అంతా విజ‌యం సాధించ‌క‌పోయినా త‌మిళ్ లో మాత్రం ఆయ‌న‌కు మంచి పేరును తీసుకువ‌చ్చింది.

VijayDevarakonda

త‌మిళంలో కూడా విజ‌య్ క్రేజ్ పెరుగుతుండ‌టంతో గ‌తంలో ఆయ‌న చేసిన సినిమాల‌ను అక్క‌డ విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాకు ముందు విజయ్ న‌టించిన మూవీ ద్వార‌క. ఈచిత్రం తెలుగులో అట్ట‌ర్ ప్లాప్ అయింది. ఇప్పుడు ఆ మూవీని త‌మిళ్ లో అర్జున్ రెడ్డి పేరుతో విడుదల చేయ‌నున్నారు.

తమిళనాట విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కి ఇదొక నిదర్శనమేనని చెప్పాలి. ఇక్క‌డ ప్లాప్ అయిన సినిమా అక్క‌డ ఎలా ఆడుతుందో వేచి చూడాలి మ‌రి. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి మూవీ త‌మిళ్ లో రిమేక్ అవుతోంది. త‌మిళ న‌టుడు విక్ర‌మ్ కుమార్ కొడుకు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. త‌మిళ్ లో వ‌ర్మ పేరుతో ఈమూవీని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే వ‌ర్మ మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -