దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘వారసుడు’ అంటూ ఓ ఏవరేజ్ సినిమా తీశాడు. మరి సూపర్ హిట్ కొట్టిన తరువాత వ్యవహారం వేరు. డిజాస్టర్ లేదా ఏవరేజ్ సినిమా ఇచ్చిన తర్వాత వ్యవహారం వేరు కదా. వంశీ పైడిపల్లికి ఎంత మంచి పేరు ఉన్నా.. మంచి టాలెంట్ ఉన్నా.. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ‘వారసుడు’ సినిమా తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లికి నిర్మాతలు రెడీగా వున్నారు కానీ, హీరోలు దొరకడం లేదు.
ఆయనకు అచ్చి వచ్చిన హీరోలు ఎవరూ ఇప్పుడు వంశీ పైడిపల్లికి డేట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. సరే పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దాం అంటే.. ఆయనేమో ఫుల్ గా ఎన్నికల మూడ్ లో వున్నారు. దిల్ రాజు సంస్థలో సినిమా చేయాల్సి వుంది కానీ, హీరోలు దొరకడం లేదు. పోనీ మహేష్ తో సినిమా చేద్దాం అంటే డేట్లు లేవు. కానీ, ఈ ఏడాది వంశీ పైడిపల్లి చేత ఓ సినిమా చేయించాలన్నది దిల్ రాజు ఆలోచనగా వుంది. హీరో విజయ్ దేవరకొండతో వంశీ పైడిపల్లికి ఓ సినిమాను సెట్ చేసే పనిలో ఉన్నారు దిల్ రాజు.
ఎలాగూ వంశీ పైడిపల్లికి – విజయ్ దేవరకొండ కి మంచి రిలేషన్ ఉంది. కాబట్టి, ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. నిజానికి దిల్ రాజు దగ్గర తమిళ హీరో సూర్య డేట్ లు కూడా వున్నాయి, కానీ, సూర్య మాత్రం వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి రెడీగా లేడు. వంశీ పైడిపల్లి రొటీన్ మాస్ అండ్ ఫ్యామిలీ సినిమా తీస్తారనే ప్రచారం వుండడంతో సూర్య అంత ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. అందుకే, సూర్య ప్లేస్ లోకి విజయ్ దేవరకొండను పట్టుకొచ్చాడు దిల్ రాజు.
Also Read:పిక్ టాక్ : ఘాటు ఫోజులతో రచ్చ రచ్చ