పూరీ పైనే భారం వేసిన విజయ్ దేవరకొండ

337
Puri Jagannth Vijay Devarakonda
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డితో తన సత్తాను చాటాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అతికొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. వరుస విజయాలతో దూసుకుపోయిన విజయ్ ని ప్రస్తుతం ప్లాప్ లు వెంటాడుతున్నాయి.

ఇటివలే విజయ్ నటించిన రెండు సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లు రెండు భారీగా ప్లాప్ అయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ఇటివలే ప్రారంభం అయింది. పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటింస్తుంది. ఈమూవీపై విజయ్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన దర్శకుడు పూరీ జగన్నాథ్.

- Advertisement -