టాలీవుడ్ యూత్ సెన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా..మైత్రి మూవీ మేకర్స్ సంస్ద వారు నిర్మిస్తున్నారు. గీతా గోవిందం మూవీ తర్వాత విజయ్ రష్మీక కలిసి ఈమరోసారి ఈమూవీలో నటిస్తున్నారు. ఈసినిమాలో విజయ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.
ఈమూవీని మొదట మే31న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. కాని తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈసినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది. సినిమా అవుట్ పుట్ సరిగ్గా రానందున కొన్ని సీన్లను రీషూట్ చేయనున్నారని సమాచారం.
మరోవైపు మే 31న తమిళ హీరో సూర్య హీరోగా నటించిన ఎన్జీకే మూవీ విడుదల కానుండటంతో డియర్ కామ్రేడ్ ను వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈచిత్రాన్ని జులై 19న విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈవిషయంపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటనను విడదల చేయనుంది.