‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

311
vijay-comrade
- Advertisement -

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. ఈసినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మిస్తోంది. విజయ్ సరసన రష్మీక హీరోయిన్ గా నటించింది. ఈనెల 26న ఈచిత్రాన్ని తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈసినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈమూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రమెషన్స్ కార్యాక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

ఇటీవ‌ల జ‌ర‌గిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ని ఈ నెల 24న రాత్రి 7 గంటలకు విశాఖ జిల్లా సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విజయ్ దేవరకొండ సినిమా కావడంతో ఈసినిమాపై అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వరుస హిట్లతో జోష్ మీదున్న విజయ్ దేవరకొండ ఈసినిమా ఏవిధంగా హెల్ప్ అవుతుందో చూడాలి మరి.

- Advertisement -