హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ తమ్ముడు..?

310
VijayDevarakonda
- Advertisement -

టాలీవుడ్‌కు ‘పెళ్లీ చూపులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. చిన్న చిన్న నాటకాల్లో నటిస్తూ, షార్ట్ ఫిల్మ్ల్‌లను తెరకెక్కిస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఆ తర్వాత నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం, ద్వారక వంటి చిత్రాల్లో నటించి యంగ్ హీరోల సరసన చేరాడు.

Anand Devarakonda

ఇక ఇటీవల కాలంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలోనూ నటించాడు విజయ్. ఇక ప్రస్తుతం రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సీవాలా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక విషయానికొస్తే అతి తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగాడు విజయ్. ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడట.

ఆనంద్ ఇప్పటికే ఓ వైపు నటనలో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంద్ దేవరకొండను కథానాయకుడిగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -