స‌న్ రైజ‌ర్స్ ఓట‌మిపై స‌చిన్ ట్వీట్..

251
sachintendulkar
- Advertisement -

గ‌త రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల‌ను సంద‌డి చేసిన ఐపిఎల్ 11వ సీజ‌న్ ముగిసంది. నిన్న జ‌రిగిన ఫైనల్ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబ‌ద్ పై చైన్నై జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. షేన్ వాట్స‌న్ అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఐపిఎల్ క‌ప్ ను చైన్నై సొంతం చేసుకుంది. ఇన్ని రోజులు బౌలింగ్ ను న‌మ్ముకున్న హైద‌రాబాద్ జ‌ట్టు..ఫైన‌ల్ లో మాత్రం బౌలింగ్ లో విఫ‌ల‌మైంద‌నే చెప్పుకోవాలి. గెలిచిన జ‌ట్టుపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..ఓడిన జ‌ట్టుపై సానుభూతి తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

sachintendulkar

చైన్నై టీం కెప్టెన్ ధోని పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు అభిమానులు. పోరాడి ఓడిన హైద‌రాబాద్ జ‌ట్టును ప‌లువురు సానుభూతి తెలియజేశారు. ఇక నిన్న జరిగిన ఫైన‌ల్ మ్యాచ్ పై క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ స్పందించారు. చైన్నై జ‌ట్టు అద్భుతంగా ఆడి క‌ప్ ను సొంతం చేసుకుంద‌ని ప్ర‌శంసించారు. అత్యుత్త‌మ క్రికెట్ నిన్న‌టి మ్యాచ్ లో క‌నిపించింద‌న్నారు. ఐపిఎల్ 11సీజ‌న్ మొత్తంలో చైన్నై జ‌ట్టు ఒకే ర‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంద‌న్నారు. కీల‌క మ్యాచ్ లో షేన్ వాట్స‌న్ విజృంభించి ఆడ‌టం ఎంతో ప్ర‌త్యేక‌మ‌న్నారు.

sachin

ఇక స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టుపై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు స‌చిన్. హైద‌రాబాద్ జ‌ట్టు ఓట‌మి చెంద‌డం నాకు బాధ‌కారంగా ఉందన్నారు. హైద‌రాబాద్ ఆట‌గాళ్లు త‌మ‌దైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్ ను బాగా ఆడార‌న్నారు. ఫైన‌ల్ లో ఎలా ఆడాలో ..అటువంటి ఆట తీరును హైద‌రాబాద్ ఆటగాళ్లు క‌న‌బ‌రిచారన్నారు. స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాళ్లు గ‌ర్వంగా త‌లెత్తుకోవాల‌ని స‌చిన్ ట్వీట్ చేశారు.

- Advertisement -