క్యాబ్‌ డ్రైవర్‌గా మారిన అర్జున్ రెడ్డి‌..!

237
Vijay Devarakonda became Cab driver
- Advertisement -

అర్జున్ రెడ్డి  చిత్రంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి అందించిన జోష్‌తో వరుస చిత్రాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విజయ్‌…ఈ సినిమా పట్టాలపై ఉండగానే రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కామిక్ త్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్.. క్యాబ్ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.

Vijay Devarakonda became Cab driver
ఈ  సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ చేయనున్నాడట. ఇప్పటికే  ఓ హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ను  ఫైనల్ చేయగా… ఇప్పుడు మరో కొత్తమ్మాయి ఈ సినిమా కోసం రంగంలోకి దిగనుంది. అనంతపురంలో పుట్టి పెరిగిన ప్రియాంక జవాల్కర్ అనే మోడల్ ను ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

క్యాబ్ డ్రైవర్ అతని ప్రేమ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇక తను ఓ డాక్టర్ పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

- Advertisement -