పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే తాజాగా బాయ్‌కాట్ లైగర్ అనే నినాదం జోరందుకోగా దీనిపై స్పందించారు విజయ్.
అసలు వీళ్ళకి ఏం కావాల్నో అర్ధం కావడం లేదు. మేము సినిమాలు చేసుకోకుండా ఇంట్లో కూర్చోవాలా. నేను ఇండియాలోనే పుట్టాను. నార్త్ లో ఎక్కువ రీచ్ రావడానికే కరణ్ సర్ తో కలిశామన్నారు. కరణ్ సర్ ఉన్నారు కాబట్టే నార్త్ లో కూడా ఇంత బాగా ప్రమోషన్ అవుతుంది. అయినా మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు ఎవడి మాట వినేదే లేదు అని తేల్చి చెప్పారు. ఇలాంటి సినిమాని బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు.
వాస్తవానికి బాయ్‌కాట్ లైగర్ రావడానికి కారణం..ఇది బాలీవుడ్ సినిమా అని అంతా అనుకుంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ తప్పితే మిగిలిన వాళ్ళు బాలీవుడ్ అవ్వడం నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని ప్రెజెంట్ చేయడం, ఇది హిందీ సినిమా అని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని టాక్ వచ్చింది. దీంతో బాలీవుడ్ సినిమా అనుకోని బాయ్ కాట్ చేయాలని పలువురు కామెంట్స్ చేస్తుండగా ఘాటుగా స్పందించారు విజయ్.