అర్జున్ రెడ్డి తరువాత మళ్లీ ఆ తరహాలో యూత్ లో ఆసక్తి పెంచుతున్న సినిమా గీత గోవిందం. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన నటిస్తోంది. నిన్న విడుదలైన ఈ టీజర్, యువతకు బాగా కనెక్టు అవుతోంది. విడులైన 9 గంటలలోపే 20 లక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. ఈ వీడియో యూ ట్యూబ్ లో ట్రెడింగ్ లో ఉంది.
గీతగోవిందం టీజర్ కి మంచి స్పందన రావడంతో విజయ్ దేవరకొండ స్పందించాడు. ప్రజలారా.. నా మార్పు కోసం గురించి ఇంతగా వెయిట్ చేస్తున్నారా…? హే.. భగవాన్! అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. గోతా ఆర్ట్స్ బ్యానర్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కానుంది.
టీజర్ లో విజయ్, రష్మిక మందన బ్లాక్ అండ్ వైట్ సీన్ కు ప్రేక్షకులు బాగా కనెక్టు అవుతున్నారు. ఇక హీరోయిన్ రష్మిక మందన విజయ్ ని ఇంకొక్కసారి అమ్మాయిలు, ఆంటీలు అని తిరగావంటే యాసిడ్ పోస్తా అని డైలాగ్ యూత్ డబ్ స్మాస్ చేస్తూ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. గోవిందంతో మరో హిట్ విజయ్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి ఇక.