తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా `రాజా రాణి` ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `బిగిల్`. ఇది వరకు ఈ హిట్ కాంబినేషన్‌లో విడుదలైన `తెరి`(పోలీస్), `మెర్సల్`(అదిరింది) చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రంగా `బిగిల్` ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్నఈ సినిమాను ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భగా తెలుగు, తమిళంలో సినిమాను ఏక కాలంలో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కొనేరు మాట్లాడుతూ – “`బిగిల్` సినిమా హక్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యానర్‌కు దక్కడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత కల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజయ్‌గారికి స్పెషల్ థ్యాంక్స్. `118`తో మా బ్యానర్‌లో సూపర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్తమనటి కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` సినిమాను నిర్మిస్తున్నాం. ఈ నేపథ్యంలో మా బ్యానర్‌లో విజయ్, అట్లీ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇదొకటి. హీరో విజయ్‌గారి కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రమిది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్. త్వరలోనే తెలుగు టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం“ అన్నారు.
నటీనటులు:విజయ్, నయనతార, వివేక్, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ తదితరులు,సాంకేతిక వర్గం:సంగీతం: ఎ.ఆర్.రెహమాన్,సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు,ఎడిటింగ్: రూబెన్.