- Advertisement -
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘శక్తి తిరుమగణ్’. తెలుగులో భధ్రకాళి పేరుతో విడుదల కానుండగా అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోనీ కెరీర్‌లో ఇది 25వ చిత్రం కాగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. అందరూ ఇలానే తప్పుకుంటే ఎలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి.. ఆకలి ఆకలి అంటే ఎవరూ పెట్టరు లాక్కోవాలి అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన డైలాగ్‌లు అదరిపోయాయి.
సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని అందిస్తున్నారు.
- Advertisement -

