నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా?:దాసోజు

8
- Advertisement -

గ్రూప్1 లో జరిగిన అవకతవకలపై పోరాడిన విద్యార్థులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రాశణ్. మీడియాతో మాట్లాడిన శ్రావణ్..లక్షల మంది జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటం ఆడింది… హై కోర్టు విద్యార్థులకు న్యాయం చేసింది, 225 పేజీల కోర్టు తీర్పు లో వాడిన పదాలు రేవంత్ రెడ్డి కి, ప్రభుత్వానికి, tgpsc కి చెంప చెల్లు మనిపించేలా తీర్పు ఉంది అన్నారు.

నిరుద్యోగుల పాలిట tgpsc చెలగాటం ఆడుతుంది..బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసేలా GO 29 తీసుకొచ్చారు,Go29 ఒంటెద్దు పోకడల దున్నపోతు మీద వాన పడ్డట్టు లోపభూయిష్టంగా చేశారు,ఉద్యోగాలు అమ్ముకునట్టు అనుమానం కలుగుతుంది అన్నారు.

కేటీఆర్ సూచన మేరకు tgpsc సెక్రటరీ ను కలిశాం అన్నారు బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. లక్షలాది మంది గ్రూప్1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు..పరీక్షలు పెట్టడం మీకు చేతకాదు,విద్యార్థులు చదివి పరీక్షలు రాయాలా? లేక tgpsc దగ్గర నిత్యం ధర్నాలు చేయాలా?,రేపు రాష్ట్రప్రభుత్వం, tgpsc దిష్టి బొమ్మ దగ్దం చేయాలని పిలుపు నిస్తున్నాం అన్నారు.

Tgpsc కాస్త tpcc గా మారింది అన్నారు బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి. నిన్న కోర్టు తీర్పు ఇచ్చింది.ఇప్పటికీ tgpsc స్పందించ లేదు…పేరుకేమో ప్రజా పాలన , పోలీసులతో పాలన నడుపుతున్నారు..అభ్యర్థులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

- Advertisement -