ఈ ఏడాది కాలంలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్‌గా మారిన చిత్రం బిచ్చగాడు. డబ్బింగ్ చిత్రంగా బిచ్చగాడు తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా పై మొదట్లో అందరూ చిన్న చూపు చూశారు. కానీ ప్రేక్షకులు మాత్రం పెద్ద చూపుతో ఈ చిత్రాన్ని భారీ విజయంతో ముందుకు నడిపించారు. ఈ మూవీ కి లాభాలు సైతం పెద్ద హీరోలకి సాధ్యం కాని విధంగా వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియాలో అంతా హాట్ టాపిక్ గా మారిన న్యూస్ 500, 1000 నోట్ల రూపాయల రద్దు. అయితే బిచ్చగాడు సినిమాలో అవినీతి నిర్మూలన గురించి ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌లో చర్చ జరుగుతుంది.
ఆ కార్యక్రమానికి ఓ బిచ్చగాడు ఫోన్ చేసి అవినీతిని నిర్మూలించాలంటే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని సూచిస్తాడు. తన వాదనను ఉదాహరణలతో సహా వివరిస్తాడు. సరిగ్గా ఇదే విధంగా మన దేశ ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ షాకింగ్‌కు గురిచేస్తోంది. దీంతో బిచ్చగాడు సినిమా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో ఈ మూవీలో హీరోగా చేసిన విజయ్ ఆంటోని…ఇప్పుడు బిచ్చగాడు సీక్వెల్ పై ప్లాన్ చేస్తున్నాడట.
ఇందులో నల్లధనాని నీ మూల కథగా తీసుకుంటున్నాడట. దీనికి సంబంధించిన కథ , ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ప్రస్తుతం బిచ్చగాడు సినిమా అందరిని ఆకట్టుకుంది. కాబట్టి…ఈ సీక్వెల్ కి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అందుకే బిచ్చగాడు సీక్వెల్ ని దాదాపు 50 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందులో హీరో విజయ్ ఆంటోని రెమ్యునరేషన్ దాదాపు 20 కోట్ల రూపాయలు ఉంటుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కానుందట. కేవలం 3 నెలల్లో ఈ సినిమాని రిలీజ్ చేసుకునేందుకు హీరో ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు అతని సన్నిహితులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిచ్చగాడు మూవీపై పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఈ మూవీకి సీక్వెల్ అంటే కచ్ఛితంగా అందరి దృష్టి ఈ మూవీపైనే ఉంటుందని అంటున్నారు సినీవిశ్లేషకులు.