తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు తెచ్చేందుకు తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ సమాయత్తమవుతున్నారు. చెన్నైలో నిర్వహించిన పార్టీ ప్రత్యేక కార్యక్రమంలో మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పలు నూతన పథకాలను ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్…రాష్ట్రంలోని మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడమే తమ పార్టీ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మహిళా సంక్షేమంలో భాగంగా టీవీకే పార్టీ ప్రతిష్టాత్మకంగా ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ (Annapoorani Super Six) పథకాన్ని తీసుకువచ్చింది.
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.3 కోట్ల పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని విజయ్ తెలిపారు. ఈ పథకాన్ని రాబోయే సంక్రాంతి (పొంగల్) పండుగ కానుకగా అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Also Read:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..

