తెలంగాణలోని మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు అంతర్జాతీయ మరియు దేశీయ ప్రీమియం బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత గ్లెన్ఫెడిక్, ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీలు, లూయిస్ థర్టిన్ కాగ్నాక్ లు, సరికొత్త ఫ్లేవర్ల విదేశీ బీర్లు, వైన్లు త్వరలోనే తెలంగాణ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.
నూతనంగా 18 ప్రముఖ మద్యం సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ప్రాథమిక అనుమతులు మంజూరు చేస్తూ రంగం సిద్ధం చేసింది. మద్యం సరఫరా ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పెంచేందుకు ఈ 121 బ్రాండ్ల వివరాలు, సదరు కంపెనీలు సమర్పించిన పత్రాలను కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు TGBCL మేనేజింగ్ డైరెక్టర్ సీ. హరి కిరణ్ వెల్లడించారు.
ట్రేడ్‌మార్క్ వివాదాలు తలెత్తకుండా పబ్లిక్ నోటీసు జారీ చేశామని, వీటిపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నాంపల్లి అబ్కారీ భవన్‌లో లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు. లగ్జరీ విదేశీ విస్కీలు, బీర్లు మరియు వైన్లునూతనంగా అనుమతులు కోరుతున్న జాబితాలో ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లతో పాటు దేశీయ లగ్జరీ ఉత్పత్తులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి
ప్రముఖ బ్రాండ్లు, సింగిల్ మాల్ట్ & విస్కీలు12, 15, 18, 21 ఏళ్ల నాటి సింగిల్ మాల్ట్‌లు, మంకీ షోల్డర్, ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, వర్చాస్ అమెరికన్ విస్కీజిన్ & వోడ్కాహెండ్రిక్స్ జిన్, స్మోక్ ల్యాబ్ ఫ్లేవర్డ్ వోడ్కాబీర్లు & వైన్లుటైగర్ లాగర్ బీర్, కొరియన్ & జర్మన్ బీర్లు, రీకో మరియు వల్లోన్ వైన్‌యార్డ్స్ ఫ్లేవర్డ్ వైన్లుమార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులతో పాటు అంతర్జాతీయ, లగ్జరీ ఉత్పత్తులను తెలంగాణ వినియోగదారులకు అందుబాటులోకి తేడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read:మనుస్మృతిపై రాహుల్ ఫైర్

