దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రానికి కథ అందించిన రచయితగా విజయేంద్రప్రసాద్ కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. బాలీవుడ్లో భజరంగీ భాయ్ జాన్ వంటి హిట్ చిత్రానికి కథ రాసిన ఈ రచయిత ప్రస్తుతం కంగన ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ సినిమా స్టోరీ అందించారు.
బాహుబలి ప్రమోషన్లో భాగంగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్‌కు పవన్‌కల్యాణే స్ఫూర్తి అని పేర్కొన్నారు. అంతేకాకుండా పవన్ వ్యక్తిత్వం, నిజాయితీ తనకెంతో ఇష్టమని కూడా ఆ సందర్భంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందన్న చర్చ టీ టౌన్లో మొదలైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘పవన్‌తో కలిసి పనిచేయడం నాకిష్టమే. ఆయన కోసం నేను కథ రాస్తా. బహుశా.. తొందర్లోనే పవన్‌తో కలిసి పనిచేస్తానేమోన’ని అన్నారు. తన కథలతో, పాత్రలతో వందల కోట్ల విలువైన చిత్రాల్ని అందించిన విజయేంద్రప్రసాద్ పవన్ కోసం కథ రాస్తాననడం.. అభిమానుల్ని సంతోషపెట్టే విషయమే కదా?