క్రీడాకారుల‌కు అండ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం..

199
TS Govt financial assistance to veteran Players
- Advertisement -

హైదరాబాద్ నగరంలో ఉన్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీలలో పాల్గొని ప్రస్తుతం నిరుపేదలుగా ఉన్న 9మంది ప్రముఖ మాజీ వృద్ద క్రీడాకారులకు ప్రతినెలా ఆర్థిక సహాయాన్ని కల్పించాలని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.టి.రామారావు అధికారుల‌ను ఆదేశించారు. దీంతో 9మందికి వృద్ద క్రీడాకారులలో 7గురికి నెలకు రూ. 10వేల రూపాయలు , ఇద్దరికి 7,500 రూపాయలను సంవత్సరం పాటు అందజేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి ఇవాళ‌ ఉత్తర్వులు జారీచేశారు.

ముగ్గురు ఒలంపియన్లు, అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు , ఒక అర్జున అవార్డు గ్రహిత , ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు 2015 జనవరి మాసంలో నెలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అప్పటి పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉండి ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కె.టి.రామారావు ప్రారంబించారు.

హైదరాబాద్ నగరాన్ని క్రీడ రాజధానిగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ విధానాల మేరకు జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో నూతన క్రీడా కాంప్లెక్స్, క్రీడా మైదానాల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం విదితమే. దేశంలో మరే మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టని విధంగా హైదరాబాద్ నగరంలో సమ్మర్ కోచింగ్‌ల‌ నిర్వహణ ద్వారా దాదాపు లక్షా 50వేల మంది విద్యార్థినీ,విద్యార్థులకు పలు క్రీడలలో శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

అయితే గత 2016 ఫిబ్రవరి మాసం నుండి నిలిచిపోయిన వృద్ద క్రీడాకారులకు ఆర్థిక సహాయ పథకాన్ని తిరిగి పునరుద్దరించాల్సిందిగా పలువురు క్రీడాకారులు రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి విజ్ఞాపన పత్రం అందించడంతో వెంటనే ఈ ఆర్థిక సహాయ పధకాన్ని పునరుద్ధరిందాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌ని ఆదేశించారు.

గతంలో ఆర్థిక సహాయం పొందిన పది మంది ప్రముఖ సీనియర్ క్రీడాకారుల్లో ఒకరు సయ్యద్ అబ్దుల్ సలాం అనే ఒలంపియన్ మరణించగా మిగిలిన 9మంది వెటరన్ క్రీడాకారులకు 2017 ఏప్రిల్ మాసం నుండి 2018 మార్చి మాసం వరకు అందరికి కలిపి నెలకు 85వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. దీని ద్వారా సంవత్సరానికి రూ. 10,20,000లు జీహెచ్ఎంసీ ఈ క్రీడాకారులకు అందజేయనుంది.

జాతీయ , అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించి దేశంతో పాటు హైదరాబాద్ నగర ప్రఖ్యాతిని ఇనుమడించి ప్రస్తుతం ఆర్థికపరమైన సంక్షోభంలో ఉన్న ఈ గొప్ప క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని పునరుద్దరించడం పట్ల నగరంలోని పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

*ఆర్థిక సహాయం పొందే వెటరన్‌ క్రీడాకారులు*

1. మహ్మద్ జల్పాకరుద్దీన్, ఒలంపియన్ (పుట్బాల్) నెలకు రూ. 10వీలు
2. ఐ.ఎస్.హెచ్.హెచ్. హమీద్, ఒలంపియన్ (పుట్బాల్) నెలకు రూ.10వేలు
3. కె.సత్యనారాయణ, ఇంటర్నేషనల్ (హాకీ) నెలకు రూ. 10వీలు
4. బీర్ బహదూర్, ఇంటర|్నషనల్ (పుట్బాల్) నెలకు రూ. 10వీలు
5. డెన్నీస్ స్వామి, అర్జున అవార్డు గ్రహిత (బాక్సింగ్) నెలకు రూ.10వేలు
6. ఏ.సి.మల్లేశం, నేషనల్ (కబడ్డీ) నెలకు రూ. 10వీలు
7. జ.వాసుదేవయాదవ్, ఇంటర్నేషనల్ (కబడ్డీ) నెలకు రూ. 10వీలు
8. చంద్రప్రకాష్ చిరాదర్, నేషనల్ (ఖో ఖో) నెలకు రూ. 7,500
9. సమీరా బేగం, ఇంటర్నేషనల్ (టెన్నీ కాయిట్) సెలకు రూ. 7,500

- Advertisement -