హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నది విగ్రహం కాదు..ఒక విప్లవం…ఇది ఆకారానికి ప్రతీక కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సాకారం చేసిన దీపిక అని సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆశాదీపం అంబేద్కర్. ఈ రోజు ఆయన రచించిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతోంది. ఆయన చెప్పింది ఆచరించాలని అన్నారు. ఈ విగ్రహాం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు అధికారులు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ ప్రభావితం కావాలన్నారు. అలాగే ఇక్కడే అమరుల జ్యోతి కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వీటితోపాటుగా అంబేద్కర్ నమ్మిన బౌద్ధుని విగ్రహం కూడా ఇక్కడే నగరం నడిబొడ్డున ఉన్నాయని అందుకే దీనికింత ప్రాధాన్యత ఉందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…