నటి విద్యాబాలన్ అన్ని రకాల పాత్రలు చేస్తూ ఎవరికి అంతు చిక్కని రీతిలో దూసుకుపోతుంది. ఇటీవలే విడుదలైన తుమారీ సులు సినిమాతో మరోసారి క్రిటిక్స్ ను కూడా మెప్పించింది విద్యాబాలన్. కహాని మూవీ ద్వారా తనలో బెస్ట్ యాక్టింగ్ యాంగిల్ ని ప్రపంచానికి పరిచయం చేసిన విద్యా బాలన్ డర్టీ పిక్చర్ ద్వారా తనలో మరో కోణాన్ని కూడా చూపించి శభాష్ అనిపించుకుంది. గ్లామర్ హీరొయిన్లకు ప్రధానంగా ఉండాల్సిన హైట్ విషయంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తన యాక్టింగ్ టాలెంట్ తో బాలీవుడ్‌లో తన హావా కొనసాగిస్తుంది.
తాజాగా 63వ జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా విద్యాబాలన్ ఎంపికైంది. ముంబైలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
బెస్ట్ లీడింగ్ రోల్ (ఫిమేల్) కేటగిరీలో ‘బద్రీనాథ్ కి దుల్హానియా’లో పాత్రకు గాను అలియాభట్, భూమి పెడ్నేకర్ (శుభ్ మంగళ్ సావ్‌ధాన్), సబా ఖమర్ (హిందీ మీడియం), శ్రీదేవి (మామ్), విద్యాబాలన్ (తుమ్హారీ సులు), జైరా వాసిమ్ (సీక్రెట్ సూపర్ స్టార్)లు నామినేట్ అయ్యారు. ‘తుమ్హారీ సులు’లో నటనకు గాను విద్యాబాలన్‌కు ఈ అవార్డు దక్కింది. రేఖ అవార్డును బహూకరించారు.