అందుకే ‘ఎన్టీఆర్’ లో న‌టిస్తున్నా: విద్యాబాల‌న్

242
vidya-balan
- Advertisement -

న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా ఎన్టీఆర్ పేరుతో బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈచిత్రానికి ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..బాల‌కృష్ణ నిర్మాత‌గా మారారు. ఈసినిమాకు సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ ను ఇటివ‌లే ప్రారంభించారు. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌గా..ఆయ‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టీ విద్యాబాల‌న్ న‌టిస్తున్నారు. ఈసంద‌ర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్యూలో ఎన్టీఆర్ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

NTR-BIOPIC

ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని..బ‌స‌వ‌తార‌కం గురించి పూర్తిగా ఎవ‌రికి తెలియ‌ద‌న్నారు. బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టించే అవ‌కాశం నాకు వ‌చ్చినందుకు నేను చాలా అదృష్ట‌వంతురాలిన‌న్నారు. ఎన్టీఆర్ భార్య‌గానే బ‌స‌వ‌తార‌కం అంద‌రికి తెలుస‌ని..ఆమె జీవితాన్ని ఎప్పుడూ ఓ డాక్యుమెంట‌రీగా తీసుకురాలేద‌న్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ మూవీలో బ‌స‌వ‌తార‌కం పాత్ర చాల కీల‌కంగా ఉండ‌నుందని అందుకే నేను ఆ పాత్ర చేయ‌డానికి ఆస‌క్తి చూపాన‌న్నారు.

vidya balan

త్వ‌ర‌లోనే ఈసినిమా షూటింగ్ లో పాల్గోంటాన‌ని చెప్పింది. ఇక ఎన్టీఆర్ జీవితంలోకి ఎదురైన ముఖ్య‌మైన వారి పాత్ర‌ల‌ను ఈసినిమాలో చూపించ‌నున్నారు. చంద్ర‌బాబు పాత్ర‌లో ద‌గ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వ‌ర్ రావు పాత్ర‌లో సుమంత్, కృష్ణ పాత్ర‌లో మ‌హేశ్ బాబు, సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ప‌లువురు సినీయ‌ర్ న‌టులు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. సంక్రాంతి పండుగ కానుక‌గా ఈచిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -