బాలీవుడ్ హీరోయిన్, నేషనల్ అవార్డు గ్రహీత విద్యాబాలన్, గాసిప్ రాయుళ్లపై మండిపడ్డారు. తన పర్సనల్ లైఫ్ గురించి లేనిపోని వార్తలు రాస్తున్నారని, అసలు ఇలాంటి అవాస్తవాలు ఎక్కడి నుండి వస్తాయో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఎవరేమనుకుంటారోనని అలోచించకుండా మనసులో ఉన్నది చెప్పేస్తుంది. తాజాగా మీడియా తీరును ఎండగడుతూ తన మీద తనే జోకులేసుకుంది.
ఎప్పుడూ బోల్డ్‌గా మాట్లాడే విద్యాబాలన్ సినిమాల్లోనూ బోల్డ్‌గా నటిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఫిల్మ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను విద్యాబాలన్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల ఆమె వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయన్న రూమర్స్ సినీ సర్కిల్స్‌లో గుప్పుమన్నాయి.
దీనిపై ఘాటుగా స్పందించిన విద్యా, తనకు, సిద్ధార్థకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అలాగే తన ప్రెగ్నెన్సీపై కూడా ఎన్నో న్యూస్ రాశారని, అందులో ప్రతినెలా తనను ప్రెగ్నెంట్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో ఇలాంటి రూమర్స్ విషయంలో కాస్త బాధపడేదానినని అయితే వాటిని ఆపై పట్టించుకోవడం మానేశానని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.
విద్యకు నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌తో వివాహమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విద్యకు భర్తతో విబేధాలు తలెత్తాయని, ఆమె విడాకులు తీసుకోనుందని గ్యాసిప్‌లు బయల్దేరాయి. అలాగే విద్య గర్భవతి అని కూడా ఇప్పటికే పలుసార్లు వార్తలు పుట్టించారు గ్యాసిప్ రాయుళ్లు. దీనిపై విద్య తనదైన స్టైల్లో స్పందించింది.