AP:డయేరియా ఘటనపై వైద్యశాఖ

7
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని సంత బొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత రెండు రోజులుగా గ్రామంలో ఎనిమిది మందిలో అతిసారం లక్షణాలు కనిపించగా, చికిత్స పొందుతున్న వారిలో చిన్నారావు అనే వ్యక్తి టెక్కలి జిల్లా ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ పరిణామంపై మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు వైద్య బృందాలను గ్రామానికి పంపించి అత్యవసర చికిత్సను వేగవంతం చేశారు. తక్షణ చర్యలుగా అవసరమైన మందులను గ్రామానికి తరలించడం, తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపడం, శానిటేషన్ పనులను అత్యవసరంగా చేపట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. గ్రామంలో వ్యాధి వ్యాప్తి నివారణకు చేపలు, మాంసం విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు సూచించారు.

గ్రామంలోని నీటి వనరులను పరిశీలించి, కాలుష్యం ఉన్న అవకాశాలను గుర్తించేందుకు సంబంధిత శాఖలు కృషి చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని మరిగించి మాత్రమే వినియోగించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Also Read:అఖండ తాండవం..హై మూమెంట్స్!

- Advertisement -