పిచ్చి పీక్స్‌కెళ్ళడమంటే ఇదేనేమో..!

603
Video of Kashmiri man's rail stunt goes viral....
- Advertisement -

సోషల్‌ మీడియాలో హల్చల్‌ చెయ్యడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పద్దతి. అయితే ఇక్కడ ఓ ప్రబుధ్దుడు చేసిన స్టంట్‌ చూస్తే మాత్రం ‘ఇదేం స్టంట్‌రా నాయనా’…అనకుండా ఉండలేరేమో. దేన్ని ఆశించి ఇలాంటి స్టంట్‌ చేశాడోగానీ..దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. కాశ్మీరీ సంప్ర‌దాయ కుర్తా ధ‌రించిన ఓ వ్య‌క్తి ఎదురుగా రైలు వస్తుంటే పట్టాల మధ్యలో పడుకున్నాడు. త‌ర్వాత అత‌ని మీదుగా రైలు వెళ్ల‌డంతో..యాహూ సాధించాను అన్న వీర లెవల్లో నవ్వుకుంటూ వచ్చాడు.

ఇక ఈ వీడియోను చూసిన‌వారంతా తీవ్ర అస‌హ‌నానికి గురై జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లాకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోపై ఆయ‌న స్పందిస్తూ… ‘సాహ‌సాలు చేయ‌డం కోసం మ‌రీ ఈ స్థాయికి దిగ‌జార‌డం నిజంగా మూర్ఖ‌త్వం’ అని అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. ఆ వీడియో ట్రెండింగ్‌గా మారి అంద‌రూ అనుక‌రించ‌క ముందే ఆ వీడియోలో ఉన్న వ్య‌క్తిపై, తీసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఒమ‌ర్ అబ్దుల్లాను కోరుతున్నారు ప‌లువురు నెటిజ‌న్లు .

- Advertisement -