భాగమతి ప్రమోషన్స్‌లో అనుష్క…

221
- Advertisement -

అనుష్క ప్రధానపాత్రలో తెరకెక్కించిన చిత్రం భాగమతి. జనవరి 26న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా చిత్ర ప్రమోషన్స్‌లో అనుష్క బిజీగా ఉంది.ఇటీవల చెన్నైలో ఆడియో రిలీజ్, హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ జరగగా తాజాగా కేరళలో జరిగిన ప్రమోషన్స్‌లో అనుష్క పాల్గొంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు మాట్లాడుతూ… టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రం త‌ర్వాత అనుష్క న‌టించిన చిత్రం మా భాగ‌మ‌తి. ఇప్ప‌టికే విప‌రీతమైన క్రేజ్ వున్న ఈ చిత్రం అంద‌రి అంచ‌నాల‌కు అందుకునేలా ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేవ‌సేన గా అభిమాన ధ‌నాన్ని సంపాదించుకున్న అనుష్క న‌టించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో 10 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం ఈచిత్రం పై ప్రేక్ష‌కుల అంచ‌నాలు తెలుస్తుంది. అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, తమన్ రీ రికార్డింగ్, నిర్మాణాత్మక విలువలు హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఇది ఏ ఓక్క భాష‌కి సంభందించిన క‌థ కాదు. యూనివ‌ర్స‌ల్ స‌బ్జ‌క్ట్‌. త‌ప్ప‌కుండా ఏ భాష‌లో అయినా హ్య‌మ‌న్‌ ఎమెష‌న్ ఒక్క‌టే కాబ‌ట్టి ఈ చిత్రాన్ని సౌత్ ఇండియా మెత్తం అన్ని భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌మెష‌న్ లో భాగంగా కేర‌ళ కి వ‌చ్చాము. కేర‌ళ లో అనుష్క గారికి చాలా పెద్ద ఫ్యాన్ బ్యాంక్ వుంది. అదేవిధంగా ఉన్ని ముకుంద‌న్ లాంటి మ‌ళ‌యాల స్టార్ కూడా న‌టించారు. ఇంకా చాలా మంది మ‌ళ‌యాల న‌టీన‌టులు న‌టించ‌టంతో కేర‌ళ సినిమా ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని హ్రుద‌యానికి ద‌గ్గ‌ర‌గా తీసుకున్నారు. త‌ప్ప‌కుండు ఈ చిత్రం అన్ని భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని మా న‌మ్మ‌కం. అని అన్నారు.

Anushka shetty in Bhagamathi promotions

ద‌ర్శ‌కుడు అశోక్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఇంత పెద్ద అవ‌కాశాన్ని అందించిన నిర్మాత‌లు వంశి, ప్ర‌మెద్‌, విక్ర‌మ్ ల‌కి నా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.. వీరిని నేను త్రీమూర్తులు అంటుంటాను. అయితే నాకు ఇంత శ‌క్తిని అందించింది మాత్రం అనుష్క గారు. ఈ చిత్రానికి ప్రాంతం, భాష లేదు..హ్య‌మ‌న్‌ ఎమెష‌న్ మాత్ర‌మే వుంది. ప్ర‌తిఒక్క‌రు అన్ని భాష‌ల్లో ఈ చిత్రాన్ని చూసి ఆనందిస్తారు. త‌ప్ప‌కుండా స‌ర్‌ప్రైజ్ అవుతారు. భాగ‌మ‌తి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ మ‌రియు సాంకేతికి నిపుణులు అంద‌రూ ఈ చిత్రంలో పాత్ర‌ల్లా చేశారు. మెము వేసిన బంగ్లా సెట్ చిత్రం లో కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాగే తమ‌న్ గారి రీ-రికార్డింగ్, మాట‌లు, ఎఫెక్ట్స్ , ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ ఇలా ప్ర‌తి ఓక్క‌రి క‌ష్టం చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడ్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు

హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ.. నాకు ఇలాంటి ఓ మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన యు వి క్రియెష‌న్స్ వంశి, ప్ర‌మెద్‌, విక్ర‌మ్ లు నా థ్యాంక్స్‌. నా పెయిర్ గా న‌టించిన ఉన్ని ముకుంద‌న్ గారికి నా థ్యాంక్స్‌. న‌న్ను ఇంత బాగా చూపించిన సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ధి గారికి థ్యాంక్స్‌. కేర‌ళ కి ప్ర‌మెష‌న్ కి రావ‌టం చాలా హ్య‌పి గా వుంది. అందరికి ఈ చిత్రం న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను. అలాగే ద‌ర్శ‌కుడు అశోక్ చాలా బాగా నేరేట్ చేశారు, అదే రేంజి లో తీసారు. ఆర్ట్ ర‌వింద‌ర్ గారు వ‌ర్క్ ఈచిత్రంలో చాలా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది. జ‌న‌వరి 26న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. అని అన్నారు

నటీనటులు – అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్,సంగీతం – ఎస్.ఎస్.తమన్,సినిమాటోగ్రాఫర్ – మథి,పి ఆర్ ఓ- ఏలూరు శ్రీను,ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావ్,ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్,నిర్మాతలు – వంశీ – ప్రమోద్-విక్ర‌మ్‌,స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – అశోక్

- Advertisement -