గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామ ఆరింది. లండన్‌కి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే భవనంపై కూలి, భారీ మంటలతో దగ్ధమయ్యింది.
మధ్యాహ్నం 1:30 గంటలకు విమానం టేకాఫ్ అయింది. రెండు నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. విమానంలో 242 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోండగా మృతుల సంఖ్యపై ఎలాంటి క్లారిటీ లేదు.
మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపాణి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రి మరియు పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు.గాయపడినవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
#airindia #plane #ai171 latest crash visuals pic.twitter.com/8vljZ9ZtBk
— Nikhil Shah (@nikhil_avenger) June 12, 2025
Also Read:గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం

