వైజాగ్‌లో ఎఫ్2 ఆడియో ఫంక్షన్ చేయడం ఆనందంగా ఉందన్నారు విక్టరీ వెంకటేష్. వరుణ్‌తేజ్-వెంకటేష్ నటించిన ఎఫ్2 మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో ఓ బ్రదర్ మహేష్‌బాబు దొరికాడని, ఇప్పుడు ఎఫ్2 మూవీతో మరో సోదరుడు వరుణ్ తేజ్ పరిచయమయ్యాడని అన్నారు.
వైజాగ్ తనకెంతో ప్రత్యేకమని.. తన తొలి మూవీ కలియుగ పాండవులు, స్వర్ణ కమలం, సుందరకాండ, గురు మూవీలు చేశాడని గుర్తు చేసుకున్నారు. ఇదే బీచ్‌లో ‘మల్లీశ్వరీ’ కత్రినా కైఫ్ ఆడిపాడానని చెప్పి ఫ్యాన్స్‌లో జోష్ తెచ్చారు.
వైజాగ్ అంటే తనకెంతో ఇష్టమైన ప్రాంతమని తన తొలి మూవీ కళియుగ పాండవులతో పాటు మరెన్నో మూవీలు ఇక్కడే చేశానని గుర్తుచేసుకున్నారు. నా గత మూవీలను చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాలో రెచ్చిపోయే ఫర్మార్మెన్స్ వచ్చేలా చేయించాడన్నారు. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశామన్నారు. మూవీ యూనిట్ అందరూ కష్టపడి పనిచేశారని, దేవీశ్రీ ప్రసాద్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారని కొనియాడారు.