మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ గా వెంక‌టేష్..

279
venkatesh
- Advertisement -

కుటుంబ క‌థా చిత్రాల‌ను చేసుకుంటూ టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్ధానాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు విక్ట‌రీ వెంక‌టేశ్ . ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు ఎక్కువ‌గా ఇష్ట‌మైన హీరోల్లో విక్ట‌రీ వెంక‌టేష్ మొద‌టిస్ధానంలో ఉంటారు. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మ‌ల్టిస్టార‌ర్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. చిన్న హీరోల‌తో మ‌ల్టిస్టార‌ర్ సినిమాలు తీస్తూ టాలీవుడ్ లో చ‌రిత్ర‌ను సృష్టిస్తున్నాడు. వెంకటేశ్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 2 మ‌ల్టిస్టార‌ర్ మూవీ లో చేస్తుండ‌గా..ఈసినిమాలో వెంకీకి జోడిగా వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నాడు.

f2 movie

ఇటివ‌లే ఈసినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్ర‌యూనిట్. ఈచిత్రానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక నాగ‌చైత‌న్య తో కూడా వెంక‌టేశ్ ఓ మ‌ల్టిస్టార‌ర్ సినిమా చేయ‌నున్నాడు. ద‌ర్శ‌కుడు బాబీ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. ఇక ఈసినిమాకు వెంకీమామ అనే టైటిల్ ను కూడా ఖారారు చేశారు. ఇలా ఒకే సారి రెండు మ‌ల్టిస్టార‌ర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు వెంక‌టేశ్.

venkatesh, trinad rao nakkina

ఈరెండు సినిమాల త‌ర్వాత సోలో హీరోగా ఓ సినిమా చేయ‌నున్నాడు. నేను లోక‌ల్ సినిమా డైరెక్ట‌ర్ త్రినాథ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈమూవీలో వెంక‌టేష్ పోలీస్ ఆఫిస‌ర్ గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. పూర్తిగా కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈసినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. గ‌తంలో చాలాసార్లు వెంకీ పోలీస్ గెట‌ప్ లో క‌నిపించినా అందుకు భిన్నంగా ఈసినిమాలోని పాత్ర ఉంటుంద‌న్నారు. ఈసినిమాకు సంబంధించిన పూర్తివివరాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -