విక్టరీ వెంకటేశ్ ఈమధ్య సింగిల్ సినిమాలకంటే మల్టీస్టారర్ చిత్రాలను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. మహేశ్ బాబుతో సితమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, తాజాగా వరుణ్ తేజ్ తో ఎఫ్ 2, నాగ చైతన్యతో వెంకీ మామ ఇలా మల్టీస్టారర్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈచిత్రం ఈనెల 12వ తేదిన విడుదల కానుంది. వెంకటేశ్ తో మరి సినిమా చేయడానికి సిద్దమయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఇటివలే ఎఫ్ 2 సెట్లోనే ఒక లైన్ వినిపించాడట అనిల్ రావిపూడి. లైన్ నచ్చడంతో కథ రెడీ చేయమని చెప్పాడని టాక్. వెంకటేశ్ ‘వెంకీ మామ సినిమా పైర్తైన తరువాత అనిల్ రావిపూడితో మరోసారి సినిమా చేయవచ్చని తెలుస్తుంది.
అయితే వెంకటేశ్ కి కథ చెప్పి ఒప్పించడం అంత తేలికైన విషయం కాదనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తూ ఉంటుంది. ఒకటికి రెండు సార్లు కథ విన్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడట. అలాంటిది అనిల్ రావిపూడికి రెండు సార్లు అవకాశం వచ్చిందంటే ఆ ఘనత అనిల్ రావిపూడికే దక్కిందనే చెప్పుకోవాలి.