బబుల్‌గమ్…ఫస్ట్ సింగిల్

44
- Advertisement -

రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్ ని లాంచ్ చేయడంతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ సందర్భంగా వెంకటేష్ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీచరణ్ పాకాల మాస్, యూత్-ఆకట్టుకునే పెప్పీ ట్రాక్‌ గా కంపోజ్ చేసిన ఈ పాట లీడ్ పెయిర్ డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చింది. రోషన్ కనకాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు.

పాపులర్ సింగల్ రాహుల్ సిప్లిగంజ్ తన హై-పిచ్ వోకల్స్ తో అదనపు ఎనర్జీని నింపారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పెప్పీ ట్రాక్ తెలుగు సినిమా ప్రేమికులకు మ్యూజిక్, విజువల్ ట్రీట్.మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా “బబుల్‌గమ్” రూపొందించారు. సరికొత్త రొమాంటిక్ జర్నీతో ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోనుంది. ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న “బబుల్‌గమ్” తప్పకుండా చూడదగ్గ చిత్రంగా ఉండబోతుంది.

గరుడవేగ, తెల్లవారితే గురువరం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.

Also Read:కుమ్మక్కులు.. జిమ్మిక్కులు!

- Advertisement -