అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్న గంభీరంగా చూస్తున్న.. నేను కొడితే మామూలుగా ఉండదు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల సంతోషంగా లేరు… మళ్లీ కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు మొదలయ్యాయన్నారు.
పాలనా వైఫల్యాలను నిలదీస్తే కేసులు పెడుతున్నారు… కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు అన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది.. నేను ముందే చెప్పాను ప్రజలు వినలేదు అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటేశారు అన్నారు. రైతుబంధుకి రామ్ రామ్.. దళిత బంధుకి జై భీమ్ అని ఆనాడే చెప్పాను.. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓటేశారు అన్నారు.
రాబోయే రోజుల్లో విజయం మనదే, మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి అన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి… భూముల ధరలు అమాంతం పడిపోయాయి అన్నారు. ఫిబ్రవరి నెలలో భారీ సభ పెడదాం మీరంతా తరలిరండి… కాంగ్రెస్ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుంటుందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే.. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి ఎండ బెడుతున్నారు అన్నారు.
సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల టెండర్లు ఎందుకు పిలవలేదు… కాంగ్రెస్ పాలనపై అంతట అసంతృప్తి, అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచిందన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి, కరోనా టైంలో కూడా రైతుబంధు ఆపలేదు అన్నారు.
Also Read:నాగ సాధువులు.. పిండ ప్రధానం!