భారత మొదటి ఫీల్డ్ మార్షల్ అయిన సామ్ మానెక్షా జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న సామ్ బహదూర్‌ను వచ్చే యేడాది విడుదల చేస్తామని ప్రకటించారు. సామ్ పాత్రను ప్రముఖ యురి కథానాయకుడు విక్కీ కౌశల్ పోషించనున్నారు. తన మొదటి ఫోటో ఇన్‌స్టా ద్వారా వెలువరించారు. “365 రోజులు మిగిలి ఉన్నాయి…#SamBahadur in cinemas 1.12.2023” అని రాశారు.
రోనీ స్క్రూవాలా నిర్మించనున్న ఈ సినిమాను మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఫాతీమా సనా షేఖ్ నటించనున్నారు. మానెక్షా భార్య పాత్రలో సాన్య మల్హోత్రా నటించనున్నారు.
సామ్ మానెక్షా నాలుగు దశాబ్ధాల పాటు సైన్యంలో పనిచేశారు. మరియు ఐదు యుద్దాల్లో పాల్గొన్న వ్యక్తిగా నిలిచారు. 1971లో ఇండో-పాక్ వార్ విజయంలో మానెక్షా కీలకపాత్ర పోషించి…బంగ్లాదేశ్ ఆవతరణకు సహాయపడ్డ వ్యక్తిగా నిలిచారు. సామ్ మానెక్షా భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ పదవిని పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
Makers of Vicky Kaushal's 'Sam Bahadur' lock this date for release
Read @ANI Story | https://t.co/jk9QRBMZdM#SamBahadur #VickyKaushal #meghnagulzar pic.twitter.com/Sgbep8dToJ
— ANI Digital (@ani_digital) December 1, 2022
ఇవి కూడా చదవండి…
ఇక నటించను.. కారణం అదే !
బాలయ్య తర్వాతే చిరు!
తమిళ హీరోతో శేష్ నెగ్గుకొస్తాడా ?