కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈసందర్భంగా జైపాల్ రెడ్డికి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వెంకయ్య. జైపాల్ రెడ్డి వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణంతో పాటు, మాట్లాడే విధానం, వాగ్ధాటి తనకెంతో ఇష్టమని, అవే తమను మంచి మిత్రులగా మార్చిందని అన్నారు .
విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా జైపాల్‌రెడ్డి ప్రతిక్షణం ప్రజల కోసమే కష్టపడ్డారు. ఆయన మంచి వక్త.. తెలుగు, ఆంగ్ల భాషల్లో వారి ప్రావీణ్యం అమోఘం. అసెంబ్లీలో ఇద్దరమూ ఒకే బెంచీలో రెండు పర్యాయాలు కూర్చున్నాం. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డా, అకుంఠిత దీక్షతో ఉన్నతమైన స్థాయికి జైపాల్ ఎదిగారని అన్నారు. తన అపారమైన మేధస్సుతో అందరినీ ఆకట్టుకునేలా విశ్లేషణ చేయగలగడం ఆయన సొంతమని, ఆంగ్ల భాషల్లో పట్టున్న నేతని కొనియాడారు.