సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక

7
- Advertisement -

ఉపరాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఆగస్టు 21 కాగా ఆగస్టు 22న స్క్రూటినీ ఉండనుంది.

నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది ఆగస్టు 25 కాగా సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

జగదీప్ దన్‌ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఇందలో భాగంగానే ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు ప్రకటించింది సీఈసీ . రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా లోక్‌సభ సభ్యులతో పాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్లస్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు.

Also Read:పత్రికా ప్రకటనలకే రూ.133 కోట్లు!

- Advertisement -