హంత‌కురాలిగా స‌మంత‌..శృంగార తార‌గా ర‌మ్య‌కృష్ణ‌

284
super DeluxeMovie
- Advertisement -

త‌మిళ హీరో విజయ్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్న చిత్రం సూప‌ర్ డీలెక్స్. ఈమూవీలో స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్నారు. త్యాగ‌రాజ‌న్ కుమార్ రాజా ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి ఈసినిమాలో లింగ మార్పిడి చేయించుకున్న పాత్ర‌లో న‌టించ‌గా, స‌మంత హంత‌కురాలి పాత్ర‌లో న‌టిస్తోంది. వీరిద్ద‌రికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఒక రోజులో జ‌రిగే క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

Samantha-Ramya-Krishnan

తాజాగా ఈచిత్రంలో ర‌మ్య‌కృష్ణ పాత్ర గురించి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌ర‌గుతుంది. ఇందులో ఆమె శృంగార తార‌గా క‌నిపించ‌నున్నట్లు తెలుస్తుంది. లీలా అనే పాత్ర‌లో ఆమె న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. మొదటగా ఈ పాత్ర కోసం నటి నదియాను సంప్రదించిగా.. ఆమె అంగీకరించకపోవడంతో చిత్రబృందం రమ్యకృష్ణను సంప్రదించినట్టు సమాచారం.ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -