మ్యానిఫెస్టోను త‌ప్ప‌కుండా అమ‌లుచేస్తాంః సీఎం కేసీఆర్

202
cmkcr
- Advertisement -

ఎన్నిక‌ల ముందు ఇచ్చిన వాగ్దానాల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌న్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే కొప్పుల శాసనసభలో ప్రతిపాదించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి దాన్ని బలపరిచారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, మజ్లిస్ శాసనసభ్యులు బలాల, బీజేపీ నుంచి రాజాసింగ్ చర్చలో పాల్గొన్నారు. అనంతరం సభానాయకుడు, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..చ‌ర్చ‌లో పాల్గోన్న స‌భ్యులంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. పేద‌రికంతో పాటు నిర్ల‌క్ష్యం వ‌ల్ల చాలా మంది కంటి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం లేద‌న్నారు.

నా నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్ లో ఎర్ర‌వెల్లి గ్రామంలో 250మందికి కంటి చూపు స‌మ‌స్య ఉంద‌న్నారు. దీంతో నేను వెంట‌నే కంటి డాక్ట‌ర్ల‌ను పిలిపించి చెక్ చేపించాన‌ని చెప్పారు. కంటి వెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయన్నారు. మ‌నం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు ప‌థ‌కం ఇత‌ర రాష్ట్రాలు కూడా అమ‌లు చేస్తున్నాయ‌న్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అన్ని విధానాలను ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలు పరిశీలించారు. అనంతరం మాత్రమే ప్రజలు తిరిగి అఖండ మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించారన్నారు.

- Advertisement -