బాలీవుడ్ లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

266
vijay devarakonda
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న డియ‌ర్ కామ్రేడ్ మూవీలో న‌టిస్తున్నాడు. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన ట్యాక్సీవాలా చిత్రంతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు నిర్మిస్తోన్న డియర్ కామ్రేడ్ మూవీ స‌మ్మ‌ర్ లో విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా బాలీవుడ్ లో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ranveer-singh-kapil-dev-
కరణ్ జోహార్ తో ఈయన ఒక చిత్రం చేయబోతున్నాడని అందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా విజ‌య్ ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడ‌ని తెలుస్తుంది. బాలీవుడ్ లో విజ‌య్ ఎంట్రీ హీరోగా కాకుండా ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈసినిమాకు 1983 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 1983 ప్రపంచ కప్ సిరీస్ లో టీం ఇండియా తరపున కపిల్ దేవ్ తో పాటు కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను విజయ్ దేవరకొండ పోషించబోతున్నాడు.

- Advertisement -