నటుడు డీఎస్ దీక్షితులు మృతి..

247
DS Deekshitulu
- Advertisement -

ప్రముఖ నటుడు, దర్శకుడు డీఎస్ దీక్షితులు(63) నేడు మృతి చెందారు. దీక్షితులు ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా..ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే నాచారం ఆస్పత్రికి తరలించారు. దీక్షితులు అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు డాక్లర్లు వెల్లడించారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. దీక్షితులు స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి చిత్రంలో దీక్షితులు పోషించిన పూజారి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

దీక్షితులు వీటితోపాటు ఇంద్ర, ఠాగూర్‌, అతడు, వర్షం సినిమాల్లో తనదైన నటనతో అందరిని మెప్పించారు. అలాగే ఆయన రంగస్థల నటుడిగానూ, అధ్యాపకుడిగానూ మంచి పేరు గడించారు. జూలై 28, 1956లో జన్మించిన దీక్షితులు రంగస్థల కళలో తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. దీక్షితులు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -