వేసవిలో తాటిముంజలు తింటున్నారా..!

49
- Advertisement -

సీజన్ ను బట్టి ప్రకృతి ప్రసాధించే వాటిలో తాటిముంజలు కూడా ఒకటి. వేసవిలో మాత్రమే లభించే వీటిని ప్రతిఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తింటూ వుంటారు. పల్లెటూళ్లలో విరివిగా ఎక్కడ పడితే అక్కడ కనిపించే తాటిముంజలు.. సిటీలో మాత్రం డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిందే. తాటిముంజలకు ఉండే మరో ప్రత్యేకత ఏమిటంటే వీటిని కల్తీ చేయడానికి సాధ్యపడదు. అందుకే ఈయొక్క స్వచ్చమైన ప్రకృతి వరప్రసాదాన్ని వేసవిలో తప్పనిసరిగా తినాలి. అయితే తాటిముంజలు ఎంతో ఇష్టంగా తినేవారికి వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతాయి అనే విషయాలపై ఏమాత్రం ఎలాంటి అవగాహన ఉండదు. అందువల్ల తాటిముంజలు తింటే ఎలాంటి ప్రయోజనలు కలుగుతాయో తెలుసుకుందాం !

తాటిముంజల్లో 90 శాతం నీరు ఉంటుంది. అందుకే వేసవిలో వీటిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇక ఇందులో విటమిన్ ఏ, సి, డి వంటి వాటితో పాటు విటమిన్ కె, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా అధికంగానే ఉంటాయి. అలాగే ఇందులో జింక్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర వేడిని తగ్గించి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. ఇక వేసవిలో అధిక ఎండ కారణంగా వచ్చే సమస్యలు, వికారం, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలను తాటి ముంజలు నివారిస్తాయి. అలాగే కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలోనూ, శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ తాటిముంజలు ఎంతో ప్రయోజనకరం అని నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయట. అయితే తాటిముంజలు అధికంగా తింటే కడుపులో అసౌకర్యం ఏర్పడుతుందని, తద్వారా అజీర్తి, వాంతులు పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:భువనగిరిలో గెలుపు నాదే:క్యామ మల్లేష్

- Advertisement -