భగ భగ మండే ఎండలతో వేసవి కాలం రానే వచ్చింది. అలాగే ఎండలతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తీసుకొచ్చింది. ప్రతి సీజన్ లోనూ కొన్ని రకాల వ్యాధులు సర్వసాధారణం.. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయరాదు. అలాగే వేసవిలో కూడా కొన్ని సీజనల్ వ్యాధులు వేధిస్తుంటాయి. మరి వేసవిలో తరచూ వేధించే వ్యాధులు ఏవి ? వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం !
1) వడదెబ్బ
వేసవిలో చాలమంది వడదెబ్బ బారిన పడడం సర్వసాధారణం. విపరీతమైన ఎండ తీవ్రత కారణంగా శరీరంలో నీటిశాతం తగ్గి.. వడదెబ్బకు గురి అవుతుంటాము. ఫలితంగా శరీరం డిహైడ్రేషన్ ఏర్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి తల తిరగడం, మైకం, జ్వరం, కాళ్ళు చేతులు నొప్పులు, తిమ్మిర్లు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బను తేలిగ్గా అంచనా వేస్తే చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటే కిడ్నీలు, లివర్ వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ. అందుకే ఈ వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా. తగు జాగ్రత్తలు పాటిస్తూ నీరు ఎక్కువగా తాగాలి. అలాగే కొబ్బరినీరు, నిమ్మరసం, గ్లూకోజ్ వంటివి కూడా ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.
2) కళ్ల సమస్యలు
మిగిలిన సీజన్స్ కంటే వేసవిలో కళ్ల సమస్యలు అధికం. ఎందుకంటే వాతావరణ మార్పుల కరణంగా కళ్ల కలకలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య ఉన్నవారిలో కళ్ళు ఎర్రబడడం, కళ్ల నుంచి నీరు కారడం, వెలుగు చూడలేకపోవడం వంటి సమస్యలు వేదిస్తాయి. ఇది ఇతరులకు కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వేసవిలో కంటికి మంచి చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి ఉన్న పండ్లను అధికంగా తీసుకోవాలి. ఇక వడగాలుల కారణంగా కళ్ళల్లోకి దుమ్ము, ధూళి వంటివి చేసే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్ళే సమయాల్లో కూలింగ్ గ్లాసెస్ వాడడం మంచిది.
3) చర్మ సమస్యలు
వేసవిలో చర్మసమస్యలు చాలమందిని వేదిస్తుంటాయి. ఎందుకంటే బయట తిరిగినప్పుడు విపరీతమైన ఎండ కారణంగా చెమట అధికంగా పడుతుంది. చెమటకు తోడు దుమ్ము, ధూళి వంటివి చర్మంపై పడి పెరుకుపోయి, చెమటకాయలు ఏర్పడతాయి, దాంతో విపరీతమైన దురద, మంట ఏర్పడుతుంది. కాబట్టి శరీర శుబ్రత వేసవిలో చాలా అవసరం. రోజుకు రెండు లేదా మూడు సార్లు స్నానం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ వేసవిలో చర్మ సంరక్షణకై సూన్ లోషన్స్, కూలింగ్ పౌడర్స్ వంటివి వాడడం మంచిది.
4)డీహైడ్రేషన్
వేసవిలో ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య డీహైడ్రేషన్ బారిన పడడం. డీహైడ్రేషన్ కు గురైన వారిలో వాంతులు, వికారం, జ్వరం, కడుపునొప్పి మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో ఈ వేసవిలో డీహైడ్రేషన్ బారిన పదకుండా కొబ్బరినీళ్ళు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.
ఇంకా ఈ వేసవిలో టైఫాయిడ్, అతిసార, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో వేసవిలో తినే ఆహారం మొదలుకొని వ్యక్తిగత పరిశుభ్రత వరకు ఎన్నో జాగ్రతలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:నిరంతరంగా గ్రీన్ ఛాలెంజ్..