వేణు ఉడుగుల.. “బాగుంది”

16
- Advertisement -

కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ తేజ – భవ్యశ్రీ హీరోహీరోయిన్లుగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “బాగుంది”. శ్రీరామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ ,దేవిశ్రీ పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజనేని వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్ లాంచ్ చేయ‌గా.. ఫస్ట్ లుక్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లాంచ్ చేశారు.

అనంతరం చీఫ్ గెస్ట్ దర్శకులు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా టీజర్ నిజంగా బాగుంది. హీరో కిషోర్ తేజ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ కుమార్ చాలా పెర్ఫెక్ట్ గా తీశారు. నిర్మాతలు క్వాలిటీ విష‌యంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. వారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలు వచ్చి మరిన్ని సినిమాలు తియ్యలని కోరుకుంటున్నాను.. అన్నారు.

చిత్ర నిర్మాత రాజనేని వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ… డైరెక్టర్ రామ్ కుమార్ చిన్ననాటి స్నేహితుడు ఓ సినిమా చేద్దామన్నారు. కథ విన్నాను బాగా నచ్చింది. సినిమాపై నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. అన్ని డైరెక్టర్ దగ్గరుండి చూసుకొని సినిమాను పూర్తిచేశారు. మా సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకులు రామ్ కుమార్ మాట్లాడుతూ… శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన “బాగుంది” సినిమా సస్పెన్స్ జానర్ లో తీశాము. సినిమా చూస్తే అంతా థ్రిల్ అవుతారు. కథ చెప్పకుండానే నిర్మాత రాజనేని వెంకటేశ్వర్ రావు సినిమా చేద్దామని అడిగాను. చేద్దామని ముందుకు వచ్చారు. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశాను. బాగుంది సినిమాను కూడా కథ, కథనాలు డిఫరెంట్ గా ఉంటాయి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. ఈ సినిమాలలో మూడు సాంగ్స్, మూడు ఫైట్స్ ఉన్నాయి.. హీరో కిషోర్ తేజ చాలా బాగా చేశారు.. మంచి హార్డ్ వర్కర్ ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా దెబ్బలు తగిలించుకున్నా.. ఎప్పుడు వెనుకడుగు వెయ్యలేదు. హీరోయిన్ భవ్యశ్రీ నాతో చేస్తున్న రెండో సినిమా ఇది. చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వస్తుందని అన్నారు.

Also Read:కిరణ్ అబ్బవరం…నరకాసుర

- Advertisement -